దాడికి గురైన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించారు మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆలయాల పరిరక్షణ కోసం ఎంతో కాలంగా పోరాడుతూ వస్తున్నారని కితాబు ఇచ్చారు. రంగరాజన్ ను టార్గెట్ చేసి దాడికి పాల్పడడం దారుణమన్నారు. దాడి చేసిన వారిని చట్ట పరంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు కేటీఆర్.