చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సి.ఎస్. రంగరాజన్ పై జరిగిన దాడిపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సంఘటనను ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలన్నారు. ఆలయ సంప్రదాయాలను పరిరక్షించడంలో, వాటి పవిత్రతను కాపాడు కోవడంలో రంగరాజన్ సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతూ వస్తున్నారని కొనియాడారు. తెలంగాణ సర్కార్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.