టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఫలితాలపై స్పందించారు. తమ పార్టీ పుంజుకుందని, బీజేపీ అడ్డగోలు హామీలతో మభ్య పెట్టిందని, అందుకే గెలిచిందన్నారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు అహం పెరిగిందన్నారు. అవినీతి నిర్మూలన పేరుతో ఏర్పాటైన ఆప్ ఇవాళ కరప్షన్ కు కేరాఫ్ గా మారడం దారుణమన్నారు. అందుకే రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకునేందుకు ఒప్పు కోలేదన్నారు. తనతో ఢీకొనే సత్తా కేజ్రీవాల్ కు లేదన్నారు.