హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చి వేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది. ఒక్క రోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యమవుతుందంటూ మండిపడింది. తన ఆస్తులను అక్రమంగా కూల్చి వేశారంటూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కోహెడ డ్రామానికి చెందిన సామిరెడ్డి బాల్ రెడ్డి. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు సెలవు దినాల్లో కూల్చి వేతలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించింది.