హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ లోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో మాట్లాడుతుండగా న్యాయవాది ముఖీం జోక్యం చేసుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. మీకు తెలుగు వచ్చా అంటూ కమిషనర్ ను ప్రశ్నించారు న్యాయవాది. దీంతో తమకు కూడా లా గురించి తెలుసని, విషయం చెప్పండి ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు.