తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిశారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని, తాను ఏనాడూ ఆమెను ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా కిరణ్ రాయల్ ను విచారణ పూర్తయ్యేంత వరకు పార్టీకి దూరంగా ఉండాలని జనసేన హైకమాండ్ ఆదేశించింది.