తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 84 వేల 536 మంది దర్శించుకున్నారు. 25 వేల 890 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు , విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.