తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అల్పాహార పంపిణీ నిర్వహించారు. మాజీ డీఎస్పీ రవికుమార్, మాదారం ఎస్ఐ సౌజన్య హాజరై అల్పాహారం పంపిణీ చేశారు. తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుపేదలకు దుప్పట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం పట్ల అభినందించారు. కూలీలు, ఇతరులకు అల్పాహారం పంపిణీ ద్వారా మేలు చేకూరుతుందన్నారు.