ఢిల్లీలో బీజేపీ గెలిచిన సందర్బంగా బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు బిజెపి జిల్లా నాయకులు. పట్టి వెంకట కృష్ణ హాజరై మాట్లాడుతూ ప్రధాని మోదీపై ఢిల్లీ ప్రజానీకం విశ్వసనీయత చూపి బీజేపీకి అధికారం కట్టబెట్టారని అన్నారు. 27సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా సారధ్యంలో బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు.