చిలుకూరు బాలాజీ ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త సౌందర రాజన్, ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడికి పాల్పడిన రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 20 మందితో కలిసి దాడికి పాల్పడ్డాడని, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు మొయినాబాద్ పోలీసులు. ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని రామరాజ్యం సంస్థకు చెందిన వారు దాడికి పాల్పడినట్లు సమాచారం.