సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం మోడీపై. బీజేపీకి ఆయన తప్ప వేరే దారి లేదన్నారు. కానీ తమ పార్టీలో హేమా హేమీలు ఉన్నారని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సైతం పీఎం పేరు చెప్పుకుంటేనే వాళ్లకు ఓట్లు పడతాయంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ తాను గనుక ప్రచారం చేస్తే ప్రజలు తనను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనుకునే ప్రమాదం ఉందన్నారు. జాతీయ నాయకత్వం క్యాంపెయిన్ చేస్తే ఆ ప్రభావం ఉండక పోవచ్చని అభిప్రాయపడ్డారు.