మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. దమ్ముంటే మరోసారి రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. సాకులు వెతకడం ఆపేసి చర్యలు తీసుకోవాలన్నారు. కావాలని బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. తప్పించుకునే ప్రయత్నం చేయడం ఏ మాత్రం మంచి పద్దతి కాదన్నారు. 41 లక్షల మంది బహుజనులు లేకుండా సర్వే ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడం మానుకుని ఆచరణాత్మకంగా పని చేయాలన్నారు.