ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కూటమి విభేదాలే కొంప ముంచాయని అన్నారు. హర్యానాలో ఆప్ ఏ విధంగా కాంగ్రెస్ ఓటమికి కారణమైందో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి హస్తం కారణమైందని పేర్కొన్నారు. చిట్ చాట్ సందర్బంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇండియా కూటమిలో చోటు చేసుకున్న విభేదాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయన్నారు. ఒకవేళ ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే సీన్ వేరేగా ఉండేదన్నారు.