ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో 100 మంది మహిళలు బరిలో నిలిచారు. ఇందులో కేవలం5 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది పోటీ చేశారు. బీజేపీ 50 సీట్లలో గెలుపొందగా 20 సీట్లలో ఆప్ విజయం సాధించింది. బీజేపీ నుంచి నలుగురు విజయం సాధించగా ఆప్ నుంచి ఒకే ఒక్కరు అతిశి గెలుపొందారు. గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.