టీటీడీ తీపి కబురు చెప్పింది. ప్రవాస భారతీయ భక్తుల దర్శనానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. దర్శనం కోసం వచ్చే ఎన్నారైలకు ప్రతి రోజూ 50 మందికి మాత్రమే అవకాశం ఉండేది. భక్తుల డిమాండ్ దృష్ట్యా దర్శనం సంఖ్యను 100కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా టీటీడీ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నారైలు.