ఢిల్లీ పీఠం బీజేపీ దక్కించు కోవడంతో ఇప్పుడు సీఎం ఎవరనే దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే సీఎం పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై ప్రధాని మోడీ, ట్రబుల్ షూటర్ అమిత్ షా కీలక చర్చలు జరిపారు. ప్రస్తుతానికి బీజేపీ నుంచి సీఎం రేసులో ముందంజలో కొనసాగుతున్నారు పర్వేశ్ వర్మ. కాగా రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు పీఎం. ఆయన వెళ్లక ముందే ఖరారు చేయాలని భావిస్తోంది పార్టీ.