ప్రభుత్వం రైతులకు కీలక సూచన చేసింది. రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక గుర్తింపు నమోదును జనరేట్ చేయనుంది. ఈ ఐడీ నెంబర్ ద్వారా అన్ని పథకాలు అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది. దీనికి రైతు నమోదు అని పేరు పెట్టారు. ప్రతి రైతు ఆధార్ కార్డు, భూమి 1బి రికార్డు తో పాటు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ తో వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. వీటిని రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని, రైతు గుర్తింపు కార్డు పొందాలని సూచించింది.