కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాలనా పరంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ఆలస్యం కావడంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చకు దారి తీసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా ఉత్తమ్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.