ఢిల్లీలో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల అనంతరం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్బంగా ఎవరు సీఎం అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం పార్టీ హై కమాండ్ ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దానిపై ఫోకస్ పెట్టింది. మోడీ, అమిత్ షా ఎవరికి ఛాన్స్ ఇస్తారని పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. పర్వేశ్ వర్మనే బెస్ట్ ఛాయిస్ గా భావిస్తున్నట్లు సమాచారం.