మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ నేతలు ఎవరికి మద్దతు ఇచ్చారో ప్రజలకు తెలుసని పేర్కొంది. పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు సపోర్ట్ చేసింది మీరు కాదా అని ప్రశ్నించింది. జనం అంత త్వరగా మరిచి పోతారని అనుకుంటే పొరపాటేనని పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేయడం కల్వకుంట్ల కుటుంబానికి ఓ అలవాటుగా మారిందని ఆరోపించింది. ఇక నుంచి నోరు జారితే ఊరుకోమని హెచ్చరించింది.