ప్రతిభ గల యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు. గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి రూ. కోటి ఖర్చు చేస్తామన్నారు. పది ఎకరాలు కొనుగోలు చేసి కొత్త స్టేడియాలను నిర్మిస్తామని వెల్లడించారు.