మెట్ పల్లిలో బీజేపీ నాయకుల సంబరాలు
NEWS Feb 08,2025 05:08 pm
ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక పాత బస్టాండ్లో టపాకాయలు కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, నాయకులు సుఖేందర్ గౌడ్, సదాశివ్, మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు రమేష్, నవీన్, కుడుకల రఘు, తదితరులు పాల్గొన్నారు.