ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ శివారులో సదర్ మాట్ బ్రిడ్జ్ నిర్మాణంతో గోదావరి మధ్యలో ఉన్న కుర్రులోని 36 ఎకరాల భూమి ముంపునకు గురవుతుండడంతో ట్రాక్టర్‌పై మెట్‌ఫల్లి ఆర్డీవో శ్రీనివాస్ వెళ్లి పరిశీలించారు. ముంపు భూములను పరిశీలించేందుకు వాహనం వెళ్లడం ఇబ్బందిగా ఉండడంతో వెళ్లారు. ఆయన వెంట తహశీల్దార్ ప్రసాద్, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.