ఢిల్లీ వాసులు బీజేపీకి పట్టం కట్టారు. 70 సీట్లకు గాను 47 సీట్లలో భారీ విజయాన్ని కట్టబెట్టారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఆనాటి ప్రభుత్వం కేవలం ఉల్లిగడ్డల ధరలు పెరగడం, దానిని కంట్రోల్ చేయక పోవడంతో సాహెబ్ సింగ్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ధరలను నియంత్రించలేని సర్కార్ ను జనం దించేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ , ఆప్ అధికారంలోకి వచ్చాయి. పదేళ్లు పాలించిన ఆప్ కు బీజేపీ షాక్ ఇచ్చింది.