యూపీలోని అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి సమాజ్ వాది పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ పై 65 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రాముడు కొలువు తీరిన అయోధ్యలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీటును ఎస్పీ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం యోగి ఆదిత్యానాథ్.