ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆప్ పై, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు. అంతులేని అవినీతి కారణంగానే ఓటమి పాలయ్యారంటూ ధ్వజమెత్తారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ పరాజయం తప్పలేదన్నారు. లిక్కర్ స్కామ్ తో ఉన్న ప్రతిష్ట దిగజారి పోయిందన్నారు. అందుకే ఆప్ ను బండకేసి కొట్టారంటూ భగ్గుమన్నారు.