రానున్న వార్షిక పరీక్షల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రేరణ తరగతులకు జిల్లా కలెక్టర్ రాజార్షి షా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.