ఆదిలాబాద్ విద్యాశాఖ కార్యాలయ ఏడీగా వేణుగోపాల్
NEWS Feb 08,2025 06:04 am
ఆదిలాబాద్ విద్యాశాఖ కార్యాలయానికి ఏడీ గా పదోన్నతి పై వచ్చిన ఎస్.వేణుగోపాల్ గౌడ్ ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యారంగ సమస్యలని పరిష్కరించాలని బీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అన్ని రకాల పాఠశాలలలో చదువుతున్నటువంటి బీసీ విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నర్సా గౌడ్, అధికార ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మేకల అశోక్, సత్యనారాయణ, సెక్టోరియల్ అధికారి జెట్టి నారాయణ పాల్గొన్నారు.