ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు గాను ఇప్పటి వరకు 42 స్థానాలలో బీజేపీ ముందంజలో ఉండగా 28 స్థానాల్లో ఆప్ ఆధిక్యం కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ ఇంకా బోణీ కొట్టలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 38 సీట్లు రావాల్సి ఉంటుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది బీజేపీ. దీంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కమలనాథులు సంబురాలలో మునిగి పోయారు.