యూపీ యోగి సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో ఇప్పటి వరకు 40 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని వెల్లడించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ప్రధాని మోడీతో పాటు దేశంలోని ముఖ్యమంత్రులు, సినీ సెలిబ్రిటీలు, క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పుణ్య స్నానాలు చేశారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 26 వరకు కొనసాగుతుంది.