ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు. బీజేపీ ముందంజలో కొనసాగగా ఆప్ వెనుకంజ పడడం విస్తు పోయేలా చేసింది. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 18 సీట్లలో బీజేపీ 24 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ 1 నియోజకవర్గంలో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే అన్ని సర్వే, మీడియా సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి.