ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేశారు. ఈనెల 28న బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్బంగా బడ్జెట్ కు సంబంధించి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అన్ని రంగాలకు అత్యధికంగా నిధులు కేటాయించేలా బడ్జెట్ ను రూపొందించాలని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు.