కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాష్ట్రానికి తీపి కబురు చెప్పింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇప్పటికే రైల్వే బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే పరంగా నిధులతో పాటు కొత్త రైల్వేల నిర్మాణం, రైళ్లు కేటాయించాలని కోరారని తెలిపారు.