ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 వేల మందితో భద్రతను ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. 669 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేశారు.