దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10న తమ ముందు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల ఫోటోలు మార్ఫింగ్ చేసి వ్యక్తగతంగా డ్యామేజ్ చేశాడంటూ ఆర్జీవీపై కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఆయన ఒంగోలు పోలీసుల ముందు హాజరయ్యారు. మరో వైపు ఆర్జీవీ కారణంగా తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు.