ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి
NEWS Feb 07,2025 01:50 pm
మాల మహానాడు ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దళిత రత్న కుంభాల రాజేష్, గౌరవ అధ్యక్షులు పొట్ట శేఖర్, మాజీ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆసాది మధు, మంచిర్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ మద్దెల గోపి, పట్టణ యూత్ అధ్యక్షులు కట్ట కుమార్, సీనియర్ నాయకులు అంగూరి సుభాష్, సబ్బని అరుణ్ కుమార్, సంభోది పాల్గొన్నారు.