కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకు వెళ్లి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రముఖ పర్యటన కేంద్రం లక్నవరంకి వెళ్తున్న పర్యాటకుల కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో కట్ల నర్సయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.