ఏపీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి పాలన గాడి తప్పిందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై యుద్దం చేస్తానని ప్రకటించారు. దేశంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో జనాదరణ లేదన్నారు. గతంలో వైసీపీ చేసిన సంస్కరణలకు మంగళం పాడారంటూ బాబుపై మండిపడ్డారు.