మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై నిప్పులు చెరిగారు. రాజకీయ అత్యాచారం చేయించడంలో తను దిట్ట అంటూ మండిపడ్డారు. ఏపీపీసీసీ మాజీ చీఫ్ శైలజా నాథ్ పార్టీలో చేరడంపై స్పందించారు. ఆ పార్టీలో చేరి తప్పు పని చేశారంటూ పేర్కొన్నారు. అదో దుర్మార్గమైన పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీలో చేరి ఉండాల్సిందన్నారు.