హనుకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ పై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ ఇంట్లోతో పాటు జగిత్యాల లోని బంధువుల ఇంట్లో ఏక కాలంలో సోదాలు చేపట్టారు. తనకు వీఆర్ఎస్ కావాలని పుప్పాల కోరినా ప్రభుత్వం ఒప్పుకోలేదు. సెలవు ఇవ్వాలన్నా నిరాకరించింది. ఏసీబీ దాడులు రవాణా శాఖలో కలకలం రేపుతున్నాయి.