ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో గత నవంబర్లో వర్మపై కేసు నమోదైంది. కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. గతంలో పలుమార్లు విచారణకు డుమ్మా కొట్టారు. హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయడంతో గత్యంతరం లేక వస్తానని తెలిపారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ల ను వ్యక్తిగతంగా కించ పర్చేలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి.