కీలక అంశాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుల గణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్ కు అందజేశామన్నారు. సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా రిపోర్టు తయారు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ అనంతరం కేబినెట్‌లో ఆమోదించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.