తనకు కాంగ్రెస్ పార్టీ నోటీసు జారీ చేయడంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తాను వాస్తవాలు మాట్లాడానని, అబద్దాలు చెప్పలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. ఇదే విషయాన్ని మండలిలో తాను లేవనెత్తానని ఇందులో తప్పేముందంటూ ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు ఇవ్వడంపై తాను పార్టీ హైకమాండ్ తో తేల్చుకుంటానని స్పష్టం చేశారు.