తిరుమల శ్రీవారిని 58 వేల 908 మంది దర్శించుకున్నారు. 19 వేల 549 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.23 కోట్లు వచ్చిందని వెల్లడించారు ఈవో శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.