మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఎన్ఎండీ ఫరూక్. కేంద్రం నుంచి ఏపీకి నిధులు రావాల్సి ఉందన్నారు. వాటిని సాధించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. మైనార్టీ శాఖకు నివేదిక తయారు చేయాలన్నారు. మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ. 5 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. హజ్ కు వెళ్లే యాత్రికుల కోసం రూ. 1 లక్ష అందిస్తామన్నారు.