ఏపీని టూరిజం హబ్ గా చేస్తామని ప్రకటించారు మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సరైన ప్రతిపాదనలు, ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం తరపున సహకరిస్తామన్నారు. పెద్ద ఎత్తున రాయితీలు కూడా ఇస్తున్నామన్నారు. అమెరికాకు చెందిన మ్యాక్సీ హోటల్స్ ఓనర్స్ తమను కలిశారని వెల్లడించారు. పర్యాటక రంగంలో పీపీపీ విధానంతో ముందుకు వెళుతున్నామన్నారు.