తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు ఉన్న ఎడమ కాలువలో పిచ్చి మొక్కలు పెరిగాయి.దాదాపు కిలోమీటర్ల పొడవునా పిచ్చి మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఈ కారణంగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించకోతే తమ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువలు వట్టి పోతున్నాయి.