బాధితులకు అండగా 'భరోసా' కేంద్రం నిలుస్తుందని ములుగు డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్ అన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో కేంద్రం ఏర్పడిన సంవత్సర కాలం నుంచి అత్యాచార కేసుల బాధితులకు పోక్సో కేసుల్లో సంబంధిత బాధితులకు ఆర్థిక సహాయం అందించిం దన్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేని మహిళా బాధితులకు అసిస్టెంట్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చన్నారు.