కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీ.ఎస్ లత పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఫర్నిచర్, విద్యుత్తు ఏర్పాట్లు, నీటి వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌసూర్ రెహమాన్ ఉన్నారు.