ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. దేశ ప్రజలందరికీ సేవ చేసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. నేషన్ ఫస్ట్ అనేది మా విధానమని, కానీ ఫ్యామిలీ ఫస్ట్ అనేది ఆ పార్టీ విధానమంటూ మండిపడ్డారు.